కొండ గట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకుంది మహిళా అఘోరి. కేథర్ నాథ్ లోని మాతాకి శిఖర్ నుంచి వచ్చింది అఘోరి. హిందూ ధర్మ శాస్త్ర ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్టు తెలిపింది అఘోరి. కొండగట్టు అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆమె ఆంజనేయ స్వామి వారికి పూజలు చేశారు. కొండగట్టుకు వచ్చిన భక్తులు మహిళా అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఎక్కువ సేపు ఆమెను ఉండకుండా పంపించేశారు. ఆ మహిళా అఘోరి ఎక్కడికి వెళ్లితే అక్కడ ప్రజలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నారు. అఘోరిలు అంటే ఇలా ఉంటారా..? అంటూ చర్చించుకుంటున్నారు. సాధారణంగా అఘోర, అఘోరిలు అంటే భయపడుతుంటారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం వింతగా చూడటం విశేషం. ఎందుకు అంటే వారికి అఘోరల గురించి పెద్దగా తెలియకపోవడం అనే చెప్పాలి.