Telangana: రాష్ట్రంలో ఆధార్ లేని విద్యార్థులు 5 లక్షలు

-

తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరం(2022-23)లో చదువుతున్న విద్యార్థుల్లో 5 లక్షల మందికి ఆధార్‌ సంఖ్య లేదు. రాష్ట్రంలోని 43,043 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా.. అందులో సుమారు 58 లక్షల మంది చదువుతున్నారు. ఈక్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం ఆధార్‌ నమోదు చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఏటా పదో తరగతి విద్యార్థులు చదువు పూర్తయి వెళ్లిపోతున్నారు. ఒకటో తరగతిలో ఎక్కువమంది కొత్తగా ప్రవేశాలు పొందుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారూ పాఠశాలల్లో చేరతారు. ప్రతి విద్యాసంవత్సరం పాఠశాల విద్యాశాఖ చైల్డ్‌ ఇన్ఫో పేరిట పాఠశాలల వారీగా పిల్లల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది.

విద్యార్థులు ఒకచోట నుంచి మరోచోటకు మారినా ట్రాకింగ్‌ చేసేందుకు ఆధార్‌ సంఖ్యను సేకరిస్తున్నారు. ఆధార్‌ సమర్పించని 5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని వారు 2 లక్షల మంది, ప్రైవేట్‌ స్కూళ్లలో మరో 3 లక్షల మంది ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో కొందరు విద్యార్థులకు ఆధార్‌ సంఖ్య ఉన్నా వాటిని ఇవ్వడం లేదని ఓ అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news