Former CM KCR will hold a meeting of the BS Legislative Party today: గులాబీ బాస్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్ నివాసంలో ఎర్రవల్లి వేదికగా ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కేసీఆర్ మాట్లాడుతారని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన కేసీఆర్ సూచనలు చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన మాజీ మంత్రి హరీష్ రావు నేడు చార్జీషీట్ రిలీజ్ చేయనున్నారు.