కేటీఆర్ కంటే నేనే సీనియర్..టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

భద్రాద్రి కొత్తగూడెం : కేటీఆర్ కంటే నేనే సీనియర్ అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ పార్టీలో కుట్ర జరుగుతోందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపణలు గుప్పించారు.

ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకం గానే తనను పక్కన పెడుతున్నారని విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కంటే నేనే సీనియర్ ని అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశంలో ఓడిపోయి టీఆర్ఎ స్ పార్టీ లో చేరి మళ్లీ గెలవలేని, దమ్ములేని తుమ్మల నాగేశ్వరరావు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.
ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించకపోతే తప్పనిసరిగా పార్టీ మారతానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news