తెలంగాణలో మరో నాలుగు రోజులు వడగళ్ల వానలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరో నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది.

శని, ఆది, సోమ వారాల్లో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్ మహా నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version