హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం.. 700 కోట్లు కాజేసి..?

-

హైదారాబాద్ లో భారీ మోసం వెలుగు సూచింది. 700 కోట్ల రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ.. మొదట పెట్టుబడులు సేకరించింది DKZ టెక్నాలజీస్. హైదారాబాద్ వ్యాప్తంగా మొత్తం 18 వేల మంది ఈ సంస్థ బాధితులు ఉన్నారు. అయితే సంస్థ బోర్డు తిప్పేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు వందలాది బాధితులు. మొత్తం 3 రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఈ సంస్థ చేతిలో మోసపోయారు.

అయితే బాధితులను నమ్మించేందుకు ఇన్వెస్టర్లకు తొలుత లాభాలు చూపింది కంపెనీ. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్ లో డబ్బులు జమ చేసారు కేటుగాళ్లు. ఆ తర్వాత 700 కోట్ల రూపాయల వరకు దండుకుని పరార్ అయ్యారు. తమ సంస్థను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తో ప్రమోషన్ చేయించారు. అయితే లాభాలు వస్తుండటంతో.. అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరి బాధితులు పెట్టుబడి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version