నంది నగర్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్..!

-

నిన్న నంది నగర్ లో జరిగిన మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించారు GHMC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్. మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నీ పంపించి ఎంక్వైరీ చేయించాం. వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది. పోలీసుల సహకారంతో ఆ మోమోస్ తయారు చేసే లొకేషన్ ను పట్టుకున్నాము. చింతల్ బస్తీలో ఒక ఇంట్లో మోమొస్ తయారు చేస్తున్నారని గుర్తించాం. అక్కడ అపరిశుభ్రంగా ఉండడం తో పాటు అనుమతి లేకుండా నిర్వహించడాన్ని మా సిబ్బంది గుర్తించారు. వెంటనే అక్కడ నుండి ఫుడ్ సాంపిల్స్ తీసుకుని లాబ్ కు పంపడం జరిగింది.

ఇక హాస్పిటల్ లో ఉన్న బాధితులను కలిసి వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం. అవసరమైన టెస్టులు చేసి ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేదా అనే రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్లను కోరాం. ఒక మహిళ చనిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ.. తన మరణానికి ఫుడ్ పాయిజనే కారణమని ఇంకా నిర్ధారణ కాలేదు. తనకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అవసరమైన అవేర్నెస్ కూడా ఫుడ్ సేఫ్టీ కల్పిస్తుంది. వారు వాడే ఆయిల్, ఫుడ్ మెటీరియల్ పై కుడా అవగాహన కల్పాయిస్తున్నాం. కొన్ని చోట్ల రిపీటెడ్ గా ఫిర్యాదులు వచ్చే వారిపై కేసులు కూడా చేస్తున్నాం. శవర్మా, మొమొస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ వెంటనే కాకుండా నిలివచేసి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తినే వారు పార్సెల్ తీసుకుని వెళ్ళాక వెంటనే తినాలని సూచిస్తున్నాము. నిలువ చేసి మళ్ళీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని లక్ష్మీకాంత్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version