ముగిసిన జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం

-

జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ముగిసింది. నగరంలోని పలు అంశాలపై సుదీర్ఘంగా కొనసాగింది కౌన్సిల్ భేటీ. రూబీ హోటల్ అగ్ని ప్రమాదం, టౌన్ ప్లానింగ్, బ్యానర్ల ఫెనల్టీ, కార్పొరేటర్ల పార్టీ మార్పు, నాలా విస్తరణ పనులు సహా పలు అంశాలపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రూబీ హోటల్ అగ్ని ప్రమాదం పై చర్చ జరిగింది. మూడు ఫ్లోర్ లకు అనుమతి ఇస్తే ఐదు ప్లోర్ లు కడితే అధికారులు ఎం చేశారు అని ప్రశ్నించారు బిజెపి కార్పొరేటర్లు.

టౌన్ ప్లానింగ్ అధికారుల వైఫల్యం తో అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదాలు జరిగి సామాన్యులు ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరిది? అని బిజెపి కార్పొరేటర్లు ప్రశ్నించారు. 15 మీటర్ల ఎత్తు కంటే తక్కువ కమర్షియల్ బిల్డింగ్స్ కి ఫైర్ NOC అవసరం లేదన్నారు సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి.

ఇలాంటి బిల్డింగ్స్ లలోనే ఇటీవల ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు జీహెచ్ఎంసీ అధికారి. ఇలాంటి బిల్డింగ్స్ లో కూడా ఫైర్ సేఫ్టీ కోసం కొత్త ప్రొసీజర్ తయారీకి కమిషనర్ అగ్నిమాపక అధికారులతో చర్చించారన్నారు సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి.

Read more RELATED
Recommended to you

Latest news