ఆటో రిక్షా కార్మికులకు శుభవార్త.. ఫిట్ నెస్ ఛార్జీలు మాఫీ..!

-

ఫ్యాసింజర్ ఆటో రిక్షా కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆటో రిక్షా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదికి, ఆరు నెలలకు ఫిట్ నెస్ చేయించడానికి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వారి ఇబ్బందులను గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఫిట్ నెస్ ఛార్జీలు ఫిట్ నెట్ నెస్ ఫీజు రూ.700, ఫర్మీట్ ఛార్జీలు రూ.500 మొత్తం రూ.1200 మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. కరీంనగర్ జిల్లా మానకొండూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రకటించారు. అయితే కరీంనగర్ లో ఏది పెట్టినా సక్సెస్ అవుతుందని.. ఇది కూడా సక్సెస్ అవుతుందని తెలిపారు.

సంవత్సరానికి రూ.60కోట్లు ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్ అంచనా వేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కష్టాలు తప్పవన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. లక్షలాది మంది ఆటోకార్మికులకు ఇది శుభవార్త అని చెప్పారు కేసీఆర్. తెలంగాణ వచ్చిన తరువాత ధాన్యంలో నెంబర్ 2 స్థానంలో ఉంది. తెలంగాణ రాక ముందు తెలంగాణ వస్తే.. మీ పరిస్థితి అంతగా బాగుండదు అని సీమాంధ్ర నాయకులు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇవాళ ఎవ్వరి పరిస్థితి బాగుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version