తెలంగాణ ప్రజలకు శుభవార్త..రేపు 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు అంటే ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టునున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మినహా మండలానికి ఒక అధికారిని ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మార్చి 31వ తేదీలోగా నాలుగు పథకాలను 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే… సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉదయం 10 గంటలకు నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న 4 పథకాలపై సంబంధిత మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.