నూతన పెన్షన్ దారులకు ప్రభుత్వం శుభవార్త..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్యనేతలు హాజరు అయ్యారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మిగతా నాలుగు గ్యారెంటీల అమలుపై చర్చించామని షబ్బీర్ అలీ చెప్పారు.

Revanth Reddy

 

మహిళలకు నెలకు రూ.2500 పథకంపై ఈ నెల 28న మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామనివెల్లడించారు. రూ.4వేల పింఛన్ అమలు పై సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలిపారు. ఈనెల 28 నుంచి మరికొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. రాష్ట్ర పరిస్థితి చాలా అస్తవ్యస్థంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా  దృష్టి సారించాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version