హైదరాబాద్ నడిబొడ్డున మరో అద్భుత కట్టడం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ చరిత్రపుటలో మరో మకుటం కొలువుదీరబోతోంది. తెలంగాణ నూతన పాలనాసౌధం.. భాగ్యనగరం నడిబొడ్డున ఇవాళ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఇవాళ ఈ కొత్త సచివాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ తరుణంలోనే ఇవాళ ఉదయం 5 గంటల నుంచే అన్ని కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
ఇక ఇవాళ మధ్యాహ్నం కొత్త సచివాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 600 మంది బెటాలియన్ సిబ్బందితో భద్రత కల్పించారు. రెండు షిఫ్ట్ లో పనిచేయనున్న 600 securtiy మంది సిబ్బంది ఉన్నారు. ఇవాళ్టి కార్యక్రమాల కోసం 500 మంది పోలీస్ సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
ఇవాళ ఉదయం 5 గంటలకు సాయంత్రం వరకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ యంత్రాంగం. డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల తర్వాత ప్రారంభమయ్యే సుదర్శన యాగంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు.