సొంతిళ్లూ కట్టుకునే వారికి త్వరలోనే రూ.3 లక్షలు మంజూరు

సొంతిళ్లూ కట్టుకునే వారికి త్వరలోనే రూ.3 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది. సీఎం కేసీఆర్ మానవతావాదిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే రోగి బంధువులకు మూడు పూటలా భోజనం పెట్టిస్తున్నారని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 కోట్ల 59 మెట్రిక్ టన్నులు ధాన్యం పండిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం నీళ్లు పారలేదని బీజేపీ తొండి మాటలు చెప్పే నాయకులు.. సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు రండి.ఎక్కడెక్కడ నీళ్లు పారాయో.. చెరువులు, కుంటలు నిండాయో.. రుజువులు చూపిస్తామని వెల్లడించారు. పేద ప్రజల కోసం పని చేసేది టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామని ప్రకటన చేశారు. పామాయిల్ తోటలకై సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు సబ్సిడీ పెట్టారు..రైతులు విరివిగా సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు.