ఆటో డైవర్లే..సిద్ధిపేట బ్రాండ్ అబాసిండర్లు – హరీశ్ రావు

-

ఆటో డైవర్లే..సిద్ధిపేట బ్రాండ్ అబాసిండర్లు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. నా బలం మీరే. నా బలగం మీరే.! మీరే మన సిద్ధిపేట బ్రాండ్ అబాసిండర్లు. ఆటో వారంటే అందరీ వారు. పుట్టుక నుంచి చావుదాక అందరీ అవసరాలకు అందే ఆటో కీలకం. అంబులెన్స్ కన్నా ముందే చేరుకుని ఆపదలో ఉన్నోళ్లను ఆదుకునే వారు అంటూ పేర్కొన్నారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వడ్డేపల్లి దయానంద్ గార్డెన్ లో సిద్ధిపేట జిల్లా ఆటో క్రెడిట్ కో ఆపరేటీవ్ సొసైటీ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా జరిగిన ఆటో కార్మికుల ఆత్మీయ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు…మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసిన తక్కువే, ఇంకా మీకు చాలా సేవ చేయాలన్నారు. మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు, చివరి శ్వాస వరకు సేవ చేస్తానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news