కాంగ్రెస్ దేశాన్ని కూడా అమ్మేస్తుంది.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లీడర్లు దొరకక కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. ఒకవేళ రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అమ్మేస్తారని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు బయటికి వస్తారని విమర్శించారు. కాంగ్రెస్ కి ప్రజాబలం లేదు.. కేవలం మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. కుర్చి కోసం కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలది తిట్లలో పోటీ బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నెంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ అని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version