ముఖ్యమంత్రి స్థాయి తగ్గే విధంగా రేవంత్ రోత ప్రచారం చేస్తున్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. లక్షా 16 వేల మంది రైతులు రుణమాఫీ కాలేదని మా దగ్గరకు వచ్చారు. కొండంగల్ లో ఓడిపోతే సీఎం రాజాకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో రైతు బందుకు కింద మేము 70 వేల కోట్లు రైతులకు అందించాం. కానీ ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అసెంబ్లీ లో చర్చ చేస్తామని చెప్పి చేయలేదు.
అలాగే మతాలతో సంబంధం లేకుండా రుణమాఫీ పై సీఎం దేవుళ్ల మీద ఓట్లే శాడు. అలా దేవుళ్ల మీద ఓట్లేసి సీఎం దేవుళ్ళను అవమానించాడు. అయితే రంకెలు వేస్తే అంకెలు మారవని సీఎం గుర్తు చేసుకోవాలి. ఆ భగవంతుడు సీఎం రేవంత్ ను క్షమించాలని కొరుతా. సీఎం రేవంత్ ఓట్లేసిన దేవాలయాలకు వెళ్లి ఆయనను క్షమించాలని కోరుతా. అలాగే త్వరలో రైతులకు జరిగిన అన్యాయం మీద పోరాడుతాం హరీష్ రావు పేర్కొన్నారు.