రేవంత్.. రాష్ట్రానికి ఒక్క మంచి పనైనా చేశావా..? : హరీశ్ రావు

-

గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ ఒక్క మంచి పనైనా చేశారా..? అని ప్రశ్నించారు హరీశ్ రావు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం.. పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.

Harish Rao

రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు అన్ని కాంగ్రెస్ ఆఫీసుల్లా మారాయన్నారు.  రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టాలనే సీఎం రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో  పాలన కొనసాగిస్తున్నారు. రేవంత్.. ఎక్కడ డబ్బులు సంపాదించాలి. ప్రతి పక్షాల పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. లగచర్లలో మహిళలను అర్థరాత్రి ఎందుకు భయపెట్టారని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ లో తొమ్మిది హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూడు సార్లు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్.. ఇప్పుడు ఎందుకు ఇస్తలేడు..? అని ప్రశ్నించారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version