హైదరాబాద్ ప్రజలకు బిగ్ రిలీఫ్..ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రమే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇది ఇలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ లో 12 cm, మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 11.4cm, కూకట్ పల్లి హైదర్ నగర్ లో 10.8cm, నాచారంలో 10.6cm, కాప్రా 10.4cm, మాదాపూర్ లో 9.8cm, ఉప్పల్ 9.6cm, బంజారా హిల్స్ లో 9.2cm, అడ్డగుట్ట 9.1cm, LB నగర్ 8.9cm, లంగర్ హౌస్ 8.7cm వర్షపాతం నమోదు అయింది.