మెట్రో రైలు బంపరాఫర్..నేటి నుంచే అమలులోకి 59 టికెట్‌ ఆఫర్‌ !

-

హైదరాబాద్‌ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. మెట్రో రైలు బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ – 59 ఆఫర్ ను తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి నుంచే సూపర్ సేవర్ – 59 ఆఫర్ ప్రారంభం కానుంది.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులందరూ లిస్టెడ్ సూపర్ సేవర్ సెలవు దినాలలో రూ. 99కి బదులుగా కేవలం రూ. 59తో మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ను పొందేందుకు ప్రయాణికులు తాము గతంలో కొనుగోలు చేసిన మెట్రో హాలిడే కార్డ్ ని ఉపయోగించవచ్చు లేదా రూ. 100తో కొత్త మెట్రో హాలిడే కార్డ్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ను పొందేందుకు మెట్రో స్టేషన్ లోని టికెట్ కౌంటర్ నుండి సూపర్ సేవర్ హాలిడేస్ లో కేవలం రూ. 59తో రీఛార్జ్ చేసుకోవచ్చు. 31 మార్చి 2024 వరకు జాబితాయాలలో ఉన్న అన్ని సూపర్ సేవర్ సెలవు దినాలలో ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version