హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. కూలిన చెట్లు.. విద్యుత్ కు అంతరాయం

-

నడివేసవిలో హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు రికార్డు స్థాయిలో వాన పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం భాగ్యనగరంలో బీభత్సం సృష్టించింది. రికార్డుస్థాయి వ‌ర్షానికి నగరంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ఇక రహదారులపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్లు చెట్లు విరగడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్‌రోస్‌, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వి సహా ఉన్నతాధికారుల‌తో టెలీకాన్ఫరెన్స్ ద్వారా స‌మీక్షించారు. భారీ వ‌ర్షాలు,ఈదురుగాలుల‌తో ప‌లుప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన వెంట‌నే స‌మ‌స్యని ప‌రిష్కరించి స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధరించాల‌ని ఆదేశించారు. లోత‌ట్టుప్రాంతాల్లో జ‌ల‌మ‌య‌మైన కాల‌నీల్లో ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన చేయూత‌ అందించాల‌ని సూచించారు.  వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది చేప‌ట్టే స‌హాయ‌క చ‌ర్యల్లో భాగ‌స్వాములు కావాల‌ని, తీవ్రత ఎక్కువ‌గా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల‌ని కార్యక‌ర్తల‌కు సీఎం సూచించారు. త‌క్షణ‌మే స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టాలని పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌రేడ్డి నిర్దేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version