నాకు తాప్సి కావాలి… అంటున్న చిరంజీవి…

-

ఒక్కోసారి చిరంజీవి మరీ చిన్న పిల్లాడు అయిపోతారు. ఎలాంటి భేషజాలు లేకుండా సరదాగా మాట్లాడేస్తుంటారు. మరీ ముఖ్యంగా మైక్ దొరికితే ‘చిరు’ అల్లరి చూడాల్సిందే. రాత్రి అలాంటిదే మరో హిలేరియస్ ఎపిసోడ్ నడిచింది. తనకు తాప్సి కావాలంటూ చిరంజీవి చిన్న పిల్లాడిలా మారాం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.

మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫంక్షన్ కు వెళ్లారు చిరంజీవి. నిర్మాత నిరంజన్ రెడ్డి తనకు స్నేహితుడు కాబట్టి ఫంక్షన్ కు వచ్చానని చెప్పిన చిరంజీవి.. తాప్సి గురించి మాట్లాడినప్పుడు చిన్న పిల్లాడిలా మారిపోయారు. ఝుమ్మంది నాదం సినిమా టైమ్ లో తాప్సిని చూసినప్పుడు పాప మంచి హుషారుగా ఉందని అనుకున్నారట చిరంజీవి.

 

 

 

 

 

కానీ ఆ టైమ్ లో రాజకీయాల్లో ఉండడంతో తాప్సితో నటించే అవకాశం తనకు రాలేదని, ఎప్పుడు తాప్సిని చూసినా ఎందుకు పాలిటిక్స్ లోకి వెళ్లానా అనే బాధ తనకు కలుగుతుందంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు చిరంజీవి. అక్కడితో ఆగకుండా.. ఈసారి తాప్సితో సినిమా తీస్తే, ఆమె పక్కన తనకు మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలంటూ నిర్మాత నిరంజన్ రెడ్డిని కోరారు.

దర్శకుడిగా ఎవ్వర్ని తీసుకున్నా తనకు ఓకే కానీ, హీరోయిన్ గా మాత్రం తాప్సినే ఉండాలంటూ నిర్మాతను డిమాండ్ చేశారు. అంతే కాదు, సిల్వర్ స్క్రీన్ పై తాప్సి తనను డామినేట్ చేయకూడదని కూడా కండిషన్ పెట్టారు. ఇదంతా చిరంజీవి సరదాగా చెప్పినప్పటికీ, ఆయన చెప్పిన విధానం, మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version