రైల్వే లైన్ల మంజూరులో రాష్ట్రానికి అన్యాయం : వినోద్‌కుమార్

-

రైల్వే లైన్ల మంజూరు విష‌యంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కు రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ల మంజూరు విష‌యంలో తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం పై ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం వివ‌క్షను మానుకోవాల‌ని అన్నారు. వచ్చే రైల్వే బ‌డ్జెట్ స‌మావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి కొత్త‌గా రైల్వే లైన్ల‌ను మంజూరు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం అవ‌త‌రించిన నాటి నుంచి శర వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి వ‌స్తున్నార‌ని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్ర‌యాణానికి ప్రాధాన్య‌త పెరుగుతుంద‌ని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి 11 కొత్త రైల్వే లైన్ల కోసం ప్ర‌తి పాద‌న‌లు కేంద్రానికి పంపించామ‌ని తెలిపారు. అయితే కేంద్రం వీటిని మంజూరు చేయ‌కుండా రాష్ట్రం పై వివ‌క్ష చూపుతుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version