మాణిక్యం ఠాకూర్ ఆసక్తికర ట్వీట్.. గూగుల్ పే లో రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా మనీ ట్రాన్స్ఫర్ ?

-

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రం తనకు ఇచ్చిన 18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారు అని టిఆర్ఎస్ పదేపదే ఆరోపిస్తుంది.

తాజాగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు పట్టణంలో ఫోన్ పే తరహాలో కాంట్రాక్టు పే పేరిట పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. 18 వేల కోట్లు రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగిందని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ తన ట్విటర్ ఖాతాలో ఓ ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. గూగుల్ పే లో ఆర్జీపాల్ అనే కాంటాక్ట్ తో ఉన్న ఓ నెంబరు నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో డీల్ జరుగుతుంది.

అందులో రాజగోపాల్ రెడ్డి ఫోటోతో ఉన్న నెంబర్ నుంచి అమిత్ షా కి మునుగోడు అమ్మకానికి కలదు అనే మెసేజ్ వెళుతుంది. దీంతో రేట్ ఎంత అని అడగగా.. మనీ ట్రాన్జక్షన్స్ జరిగిపోతాయి. ఆ తరువాత వచ్చిన స్క్రాచ్ కార్డులో మునుగోడు నాట్ ఫర్ సేల్.. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. ఈ ఆసక్తికర వీడియోని మాణిక్యం ఠాకూర్ షేర్ చేయగా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news