సూర్య పేట్ జిల్లా వాసులకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురు వారం కాలిఫోర్నియాలో పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే.. సూర్యపేట్ లో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందు కోసం గ్లోబల్ ఐటీ సంస్థతో పాటు మరి కొన్ని ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఆయా సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
కాగ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ గడుపుతున్నారు. ప్రతి రోజు పలు సంస్థలో సమావేశం అవుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఈ రోజు కాలిఫోర్నియాలో పలు సంస్థలను కోరారు. కాగ తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి త్వరలోనే రాష్ట్రానికి వస్తామని హామీ ఇచ్చారు.