జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ సభ్యత్వం కల్పించాలి : సీనియర్ జర్నలిస్ట్ మేకల కృష్ణ

-

జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ సభ్యత్వం కల్పించాలి  అని సీనియర్ జర్నలిస్ట్ మేకల కృష్ణ డిమాండ్ చేశారు. తాజాగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మీడియా కార్యకలాపాలకు కేంద్ర బిందువు. జర్నలిస్టుల ఆత్మ గౌరవానికి ప్రతీక. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వివిధ ప్యానల్ లుగా ఏర్పడి జర్నలిస్టులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఈ క్లబ్‌లో అన్ని టీవీ చానెల్స్, పత్రికల ఎడిటర్లు, స్టేట్ బ్యూరో రిపోర్టర్లు, సీనియర్ పాత్రికేయులు..ఇలా జర్నలిస్టు సంఘాలకు అతీతంగా పాత్రికేయులందరికీ ఈ క్లబ్ లో సభ్యత్వం ఉంటుంది. ప్రెస్‌క్లబ్‌లో దాదాపు 1300లకు పైగా యాక్టివ్‌ ఓటర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం ప్రెస్ క్లబ్ సభ్యత్వం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.

ప్రెస్ క్లబ్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ..సభ్యత్వానికి ఎంత మంది అర్హులో తేల్చలేదు. సభ్యత్వాలు ఇచ్చే విషయంపై కొత్తగా ఏర్పడిన పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ.. సాగదీత ధోరణి కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కొత్త పాలక మండలి.. ఏ మేరకు నెరవేర్చింది ? ఇప్పటికైనా కనీసం కొత్త సభ్యత్వాలు ఇచ్చే విషయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. డిమాండ్ చేస్తున్నాం. లేదంటే..త్వరలోనే సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులతో ప్రెస్ క్లబ్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ మేకల కృష్ణ. 

Read more RELATED
Recommended to you

Exit mobile version