మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బిఆర్ఎస్ ఉన్నానో లేనో పార్టీ అధినాయకత్వానికి తెలియాలని పేర్కొన్నారు. నాకు మెంబర్స్ పుస్తకాలు కూడా ఇవ్వలేదు… కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరాచకాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కొల్లా పూర్ లో రౌడీలాంటి కొందరు పోలీసులను తీసుకొచ్చి… నా అనుచరులు …కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కొల్లాపూర్ లో పోలీసుల ఆరాచకాలపై డీజీ దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రగతి భవన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదు… ఎస్సీ ,ఎస్టీ, బీసీ కమిషన్లను ఆశ్రయించాలని నాకు సలహా ఇచ్చారన్నారు. సాధించిన తెలంగాణ లో అనుకున్న లక్ష్యాలు సాధించామా లేదా అన్నది చూడాల్సిన సమయం అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.