హైదరాబాద్ లో కెఏ పాల్ హౌస్ అరెస్ట్

-

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో అన్ని హాంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

అయితే సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించవద్దని, ఏప్రిల్ 14న ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి.. కెసిఆర్ పుట్టినరోజున ప్రారంభించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు కెఏ పాల్ వెళుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news