తెలంగాణ బీజేపీకి షాక్..పార్టీకి కరాటే కళ్యాణి గుడ్ బై…!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరాటే కళ్యాణి… నటిగా కంటే ఎప్పుడు వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. తరచూ తనకు సంబంధంలేని వివాదాలలో తలదూరుస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. అయితే.. తాజాగాతెలంగాణ బీజేపీకి మరో షాక్‌ ఇచ్చింది కరాటే కళ్యాణి. బీజేపీ పార్టీకి కరాటే కళ్యాణి గుడ్‌ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా పెట్టింది కరాటే కళ్యాణి. చాలా రోజులుగా చూస్తున్నా నచ్చడం లేదు బీజేపీ పార్టీ మారితే బెస్ట్ అనిపిస్తుంది..కానీ మోడీ గారికీ సపోర్ట్ చేస్తా, మారే పార్టీని బట్టి…పూర్తిగా నా నిర్ణయం ఉంటుంది… పిచ్చి కామెంట్స్ పెట్టకండి అంటూ పోస్ట్‌ పెట్టింది కరాటే కళ్యాణి. ఇక ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. కరాటే కళ్యాణి.. బీజేపీకి త్వరలోనే రాజీనామా పెట్టబోతున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version