రేవంత్ ను యూ టర్న్ ముఖ్యమంత్రి పిలవాలి – కల్వకుంట్ల కవిత

-

రేవంత్ ను యూ టర్న్ ముఖ్యమంత్రి పిలవాలని BRS MLC కల్వకుంట్ల కవిత చురకలు అంటించారు. రేవంత్ సర్కార్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యిందని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు…ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశాడని నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారు…అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారని ఆగ్రహించారు.

kavitha counter to revanth reddy

వేదిక, కుర్చీలు,లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా? అని నిలదీశారు. మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రియాంక గాంధీ నీ ఏ హోదా లో రెండు గ్యారంటీ లకు అమలు చేయడానికి పిలుస్తున్నారు…ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారని నిలదీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version