బీఆర్‌ఎస్ పార్టీకి 12 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. బీజేపీకి ఒక సీటు వస్తుందని..కాంగ్రెస్ ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాట్లాడుతూ… 17 రోజుల బస్సు యాత్ర తర్వాత నాకు జనం నుంచి సమాచారం వచ్చింది…రెండు జాతీయ పార్టీల కంటే ఎక్కువగా brs కు సీట్లు వస్తాయన్నారు.
ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసింది….పాత ప్రభుత్వం చేసిన పనులను సమీక్షలు చేయాలన్నారు. కానీ ఇక్కడ భిన్నంగా జరిగింది…చాలా అమూల్యమైన సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వెచ్చించారని ఫైర్ అయ్యారు. ఆ చేసిన తప్పే వాళ్లకు ఇప్పుడు కనిపిస్తుంది,,,,రాహుల్ గాంధీ వస్తేనే సరూర్ నగర్ సభ కు ఎవరూ రాలేదని వివరించారు. ఇదే వారి ఓటమికి సంకేతం అన్నారు.కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని చెప్పాలి.. కానీ కాంగ్రెస్ రాగానే ఇది దివాళా తీసింది అని చెప్పారన్నారు.