రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పతనం ఖాయమని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భైంసా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పై ఈటల రాజేందర్, ప్రధాని మోదీ ఫోటోలు పెట్టాలని అన్నారు. ఈటెల రాజేందర్ ఉపఎన్నికతో వచ్చింది కాబట్టి అందుకే ఈ పథకం పై వారి ఫోటోలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణిచివేయడం, ప్రజాధనాన్ని దోపిడీ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి వచ్చిన మోడీని అడ్డుకోలేరని.. మూడోసారి ప్రధానిగా మోడీ అవడం ఖాయమన్నారు. ఇక వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపిదే అధికారం అని స్పష్టం చేశారు. మరోవైపు వైయస్ షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఉన్నారా? ప్రతిపక్షాలను అనచివేసేందుకు ఉన్నారా అని ప్రశ్నించారు.