అవన్నీ అర్ధం, పర్ధం లేనివే : కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అలానే ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని, దీనికి సంబంధించి సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా రీ డిజైన్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు.

ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టిఎంసిలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన బచావత్ అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తుందనే విషయాన్ని ఆధారాలతో తెలపాలని పేర్కొన్నారు. నీటి కేటాయింపులు లేకున్నా ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో కూడా సమావేశంలో నిలదీయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివే అని కేసీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news