ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కేసీఆర్‌ శుభవార్త

ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి.. మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. తొలగిం చిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసి స్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు.

ఇవాళ్టి నుంచి వారిని విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌ రావు.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. రెండేళ్లు కిందట ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను కేసీఆర్‌ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తమను విధుల్లోకి తీసుకోవాలని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నారు. అయితే.. తాజాగా వారికి శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్.