కేసీఆర్ చేసిన పాపం.. ప్రమాదంలో సింగరేణి.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు..!

-

సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని, గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ రాసిచ్చారని, కేసీఆర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పడిందని ఆరోపించారు. అదానీ, అంబానీలు కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నారని, ఈ కుట్రకు కేసీఆర్ సహకరించారన్నారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

బొగ్గు గనులను ప్రైవేట్ కు అమ్మేస్తున్నారని, ఇప్పటికే కోయగూడెం ఇచ్చేశారన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పిన కిషన్ రెడ్డి ఇటీవల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పాడన్నారు. తాజాగా కొత్త బొగ్గు గనుల ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించే మోడీ కుట్రలో కిషన్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. కిషన్ రెడ్డి సౌమ్యుడుగా ఇన్ని రోజులు అనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేశాడని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version