బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం – కిషన్ రెడ్డి

-

మేం అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి. బిజెపి తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వాక్యాలు చేశారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే తొలి కేబినెట్ సమావేశంలోనే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని అన్నారు.

kishan reddy

మతపరమైన రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ముందు నుంచే సామాజిక న్యాయం చేసే పార్టీ బిజెపి అని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. ఆ ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ పరిస్థితి జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన కోసమే తెలంగాణ వచ్చినట్టుంది.. కేసీఆర్ పేద ప్రజల కోసం చేసింది తక్కువ అని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version