నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు – కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరో ఆడియో

-

నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరో ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియో వైరల్‌ గా మారింది. నిన్న ఆస్ట్రేలియాకు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే.. ఆస్ట్రేలియాకు చేరుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. అక్కడ ఎయిర్‌ పోర్టులో కాంగ్రెస్‌ పార్టీ అభిమానులతో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినా.. కాంగ్రెస్‌ గెలవదన్నారు. తాను ప్రచారం చేస్తే.. ఓ 10 ఓట్లు పెరుగుతాయి తప్ప… కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అస్సలు గెలవదని కుండ బద్దలు కొట్టారు. ఇక నేనే ప్రచారానికి వెళ్లి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఎంపీగా మరియు ఎమ్మెల్యే గా 25 ఏళ్లు గా కాంగ్రెస్‌ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news