రాడార్ స్టేషన్ పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. నావల్ రాడార్ స్టేషన్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారికి స్వాగతం తెలుపుతూ… గత కొన్ని రోజులుగా కొంత మంది దామగుండం అడవిలో పన్నెండు లక్షల చెట్లు కొట్టేస్తారు అని అబద్ధాలు చెప్తున్నారన్నారు. అసలు దామగుండం అడవిలో ఉన్నవే దాదాపు 2 లక్షల చెట్లు. నాకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం అక్కడ కేవలం 800-900 చెట్లు మాత్రమే ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా కొట్టేస్తారు, అఫారెస్టేషన్ కింద వేలు, లక్షల్లో చెట్లు తిరిగి నాటుతారని వివరించారు.
అడవిని రియల్ ఎస్టేట్ ఆక్రమణల నుండి, పర్మిషన్ లేని పశువుల మేత నుండి, వేటగాళ్ల నుండి, కట్టెలు కొట్టెటోల్ల నుండి ఈ నావల్ ప్రాజెక్టే కాపాడుతుంది. అడవి మరింత పచ్చగా మారుతుంది. వన్యప్రాణులకు కూడా రక్షణ దొరుకుతుంది. ఇక రాడార్ వల్ల మనుషుల ఆరోగ్యం పాడైతది అని మాట్లాడే వాళ్ళు అజ్ఞానులు, Etremely/Very Low Frequency Radar Station లు మనం వాడే సెల్ ఫోన్ కంటే తక్కువ రేడియేషన్ తో పని చేస్తే. దేశ పరిరక్షణలో భాగంగా నేవీ వాళ్ళు మన ప్రాంతాన్ని అనువైనదిగా 2007-2008 నుండి సర్వే చేసి, 2011-2013 ప్రాంతంలో ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకొని, 2017లో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా పని చేసుకోవచ్చు అని నేవీ అనుమతి తెచ్చుకొని ఇప్పుడు శంఖుస్థాపనకు సిద్ధమయ్యారన్నారు. ప్రభుత్వాలు మారినా, పార్టీలు ఏవైనా మన దేశ రక్షణకు సంభందించిన నిర్ణయాలు కొనసాగుతాయి. వేరే దేశాల భావజాలంలో బతికే వాళ్ళ మాటలు విని, వాళ్ళకు వంత పాడుతున్న టి.ఆర్.ఎస్. లాంటి పార్టీల మాయలో పడి మోసపోవద్దు. వాళ్ళను ఎప్పుడూ నమ్మవద్దు. మన ప్రభుత్వం మీద, మన ప్రధాని మోడీ గారి మీద నమ్మకంతో మనం ఈ ప్రాజెక్టు ను స్వాగతిద్దామని కోరారు.