తెలంగాణలో మొదటి సారి ఉమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మొదటి ఉమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి మంగళ వారం కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజ్ ను మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దే అంశంపై ఈ సమావేశలో కీలకంగా చర్చించారు.
త్వరలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న కోఠి ఉమెన్స్ కాలేజ్ ను త్వరలోనే మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి ప్రకటించారు. కోఠి ఉమెన్స్ కాలేజ్ ను యూనివర్సిటీ గా చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజ్ లో 4,159 మంది విద్యార్థినులు ఉన్నారని అన్నారు. అయితే ఈ కాలేజ్ ను మహిళా యూనివర్సిటీ గా మార్చితే.. ఈ సంఖ్య భారీ గా పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
అలాగే ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజ్.. యూనివర్సిటీ మార్చితే.. మరింత ముందుకు వెళ్తుందని అన్నారు. అలాగే కోఠి ఉమెన్స్ కాలేజ్ ను మహిళా యూనివర్సిటీ మార్చడానికి అవసరం అయిన అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. వాటిని ప్రభుత్వానికి అందజేయాలని సంబంధిత అధికారులను విద్యా శాఖ మంత్రి ఆదేశించారు.