గవర్నర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..ము* కింద అంటూ !

రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్, ప్రభుత్వం మధ్య దుమారం రేపుతున్నాయి. కావాలనే వేడుకలు నిర్వహించడం లేదని తమిళిసై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, దీనికి బిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ‘నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్. ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నావ్. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను గవర్నరు ము** కింద పెట్టుకుంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

ఇక గవర్నర్ తమిళ్ సై పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వాక్యాలను బిజెపి నేత డీకే అరుణ ఖండించారు. ‘బిల్లుల ఆమోద ప్రక్రియపై కనీసం అవగాహన లేని కౌశిక్ లాంటి నీచమైన వ్యక్తులకు కెసిఆర్ పదవులు కట్టబెట్టారు. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వారిపైకి ఊరకుక్కల విడిచిపెట్టారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన హస్తం లేకపోతే ఎమ్మెల్సీ ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. లేదంటే బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.