నాకంటూ ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదన్నారు కేటీఆర్. నా మిత్రుడి ఫార్మ్ హౌస్ ను నేను లీజుకు తీసుకున్నాను….ఎఫ్.టి.ఎల్ లో వుంటే నేనే దగ్గర ఉండి ఫార్మ్ హౌస్ ను కూలగొట్టిస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి, నేతలు కె.వి.పి రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ లను కూల్చాలని డిమాండ్ చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్ హౌస్ నుండి స్టార్ట్ చేద్దామన్నారు. వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ నీళ్ళల్లో ఉందన్నారు. నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉందని చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోండి అంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల నుండి స్టార్ట్ చేయండన్నారు. రేపు చేవెళ్లలో జరిగే రైతు నిరసన కార్యక్రమంలో నేను పాల్గొంటానని ప్రకటించారు కేటీఆర్. రైతులకు రుణమాఫీ,రైతు భరోసా ఇచ్చే వరకు వెంట పడుతాము.. రైతుల పై కేసులు ఉపసంహరించుకోండన్నారు.