కర్ణాటక కరెంటు కావాలా.. ? తెలంగాణ కరెంటు కావాలా ? – KTR

-

కర్ణాటక కరెంటు కావాలా.. ? తెలంగాణ కరెంటు కావాలా ? అంటూ తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు మంత్రి KTR. TUWJ మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ మాట్లాడుతూ…కర్ణాటక కరెంటు కావాలా..తెలంగాణ కరెంటు కావాలా చలో ధేక్ లేంగే…కర్ణాటక పోదాం అక్కడి రైతులను అడుగుదాం కరెంట్ ఎలా వస్తుందో అడుగుదామని సవాల్‌ చేశారు. కాంగ్రెస్ నాయకులారా ఒకే బస్సులో వెళదాం కర్ణాటకకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌.

3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ప్రగతి నివేదికలు సమర్పించి ముందుకెళ్తున్నాం. సోనియాగాంధీ బలిదేవత అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలిందన్నారు. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆరాటపడుతోంది. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారు కేంద్రంలో బీజేపీకి ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. బిజెపి ఈ సారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version