మూసీ పరిధిలో ఆక్రమణల తొలగింపునకు లైన్ క్లియర్.. అధికారులకు కేటీఆర్ ఆదేశాలు

-

మూసీ నదిపైనా కబ్జాలను తొలగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖా మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. ప్రభుత్వం నిర్మించిన 10 వేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను మూసీనది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించాలని సూచించారు. అత్యంత పేదరికం వల్ల మూసీనది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జంటనగరాల అభివృద్ధికై చేపట్టిన ఎస్​ఆర్​డీపీ, ఎస్​ఎన్​డీపీ కార్యక్రమాల ప్రస్తుత, భవిష్యత్​ కార్యకలాపాలపై చర్చించారు. మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి.. మూసీ నాలాలను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. అడ్డంకులు తొలిగించిన అనంతరం.. మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రాథమికంగా ప్లానింగ్‌ పూర్తి చేసిందని మంత్రి వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version