జగిత్యాలలో 56 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరించిన కేటీఆర్‌

జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ రావు ఏర్పాటు చేసిన 56 అడుగుల కోదండరాముడి భారీ విగ్రహాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే.. మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పేద ప్రజల కోసం రూ. 6.40 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 110 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ కేటీఆర్, శ్రీ కొప్పుల ఈశ్వర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. అటు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌.