ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు – KTR

-

ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు అంటూ బండి సంజయ్‌ ని ఉద్దేశించి ఓ రేంజ్‌ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన ట్వీట్‌ చేశారు.

కేసీఆర్ ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండని.. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం పోయి ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

 

అయితే..  బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌ కు కౌంటర్‌ ఇస్తూ.. ఈ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని బండి సంజయ్‌ పై సెటైర్లు పేల్చారు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండని కోరారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news