మేడిగడ్డ బొందలగడ్డగా మారింది : మంత్రి పొన్నం

-

మేడిగడ్డ కుంగడానికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేడిగడ్డ బొందల గడ్డగా మారింది. ఇంట్లో ఒక ఫిల్లర్ కూలినా.. ఇల్లు కూలినట్టేనని పేర్కొన్నారు.  దమ్ముంటే కేటీఆర్ కరీంనగర్ లో పోటీ చేసి గెలువు అని సవాల్ చేశారు. ముందు మాపై గెలిచి చూపించు అని సవాల్ విసిరారు. నిజంగా మీది ఏం పొరపాటు లేకుంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత వీరిలో ఎవరైనా ఒక ప్రకటన చేశారా..? ఇది కుట్ర కోణం దాగి ఉందని కేసు పెట్టింది మీరే కదా అన్నారు. 

తొలుత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీతో కలిసి పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు  సందర్శించారు అని.. అప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ శాసన సభ అంతా అధికారికంగా మేడిగడ్డను సందర్శించిందని గుర్తు చేశారు. కానీ  బీజేపీ, బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలతో కలసి శాసన సభ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించామని గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version