రాష్ట్రంలో కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం, స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు మేమే గెలుస్తాం.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రుణ మాఫీ విషయంలో బీజేపీ BRS ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. పదేళ్లలో BRS ఇచ్చిన రుణమాఫీ ఎంత, కాంగ్రెస్ 9 నెలల్లో ఇచ్చిన రుణ మాఫీ ఎంతో రైతులు గుర్తించాలి. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
ఇది తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలికంగా BRS కు నష్టం చేకూరుస్తుంది. బీజేపీ , BRS లు ప్రజలను మభ్యపెడుతున్నాయి. వీలైనంత త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఇక హైడ్రా, మూసి ప్రక్షాళన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.పేదలకు అన్యాయం జరగనివ్వం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నాడు.