డీజీపీ ఆఫీసులో మహేష్ భగవత్ కి ఫిర్యాదు చేసి బయటకు వచ్చేసారు మనోజ్ దంపతులు. సుమారు 30 నిమిషాల పాటు మహేష్ భగవత్ రూంలో ఉన్నారు మనోజ్ దంపతులు. డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన మనోజ్ దంపతులు… మహేష్ భగవత్ రూం నుండి తీవ్ర భావోద్వేగంతో బయటకు వచ్చారు. దాంతో డీజీపీ ముందు మనోజ్ దంపతులు ఏడ్చేసినట్లు తెలుస్తుంది. బయాటకు వచ్చి కళ్ళ నిండా నీళ్ళతో మాట్లాడలేని స్థితిలో కార్ ఎక్కి వెళ్ళిపోయాడు మనోజ్.
అయితే మనోజ్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు డీజీపీ మహేష్ భగవత్. తమకు ప్రాణ హాణి ఉందని మహేష్ భగవత్ కి తెలిపిన మనోజ్ దంపతులు.. తమకి భద్రత కల్పించాలని కోరారు. అయితే రాచకొండ సీపీ సుధీర్ బాబు ను కలవాలని మనోజ్ దంపతులకు సూచించారు డీజీపీ మహేష్ భగవత్. అయితే రెండు రోజుల నుండి సినీ ఇండస్ట్రీలో చర్చగా మారిన మంచు ఫ్యామిలీ న్యూస్.. ఎప్పుడు కొలిక్కి వస్తుంది అనేది చూడాలి.