పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ చేరుకున్న మంచు మనోజ్.. తండ్రిపై కేసు..!

-

పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు మంచు మనోజ్. తన తండ్రి మోహన్ బాబు ప్రమేయంతోనే తనపై దాడి జరిగింది అనే అంశంపై మనోజ్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. మనోజ్ పై వినయ్ అనే వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థలో కీలక పోస్ట్ లో ఉన్నారు. ఇక విన చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన మనోజ్ నిన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకున్నారు.

అనంతరం అక్కడి నుండి జల్ పల్లి మోహన్ బాబు నివాసంకు వచ్చిన మనోజ్.. ఈ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కానీ కాసేపటిక్రితం అక్కడి నుండి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ బయలుదేరిన మంచు మనోజ్.. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇక ఇక్కడ తనపై దాడి చేసిన వారి వివరాలు పోలీసులకు ఇవ్వనున్నారు మనోజ్. ఎమ్మెల్సీ రిపోర్ట్ ను సైతం పోలీసులకు అందజేయనున్నారు మంచు మనోజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version