రాధా కోరిక మేరకే ఆమెను శిక్షించమంటూ మావోయిస్టు పార్టీ లేఖ..!

-

కొన్ని రోజుల క్రితం డాక్టర్ రాధాకు మావోయిస్టు పార్టీ మరణ శిక్ష విధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో ఓ లేఖను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అందులో.. రాధాను శిక్షించడం సరియిందనీ సమర్ధించుకుంది. అలాగే రాధా మరణానికి పోలీసులే బాధ్యత వహించాలి అని పేర్కొంది.

తాను కోవర్ట్ గా మారానని రాధే ఒప్పుకుంది. ఇక మీదట తనలా ఎవరు కోవర్ట్ గా మారకూడదని తనను శిక్షించాలని కోరింది. కాబట్టి రాధా కోరిక మేరకే ఆమెను శిక్షించడం జరిగింది అని రాధా హత్యాఉదంతం పై విడుదల చేసిన లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. రాధా ద్వారా ఒక పెద్ద కుట్రని భగ్నం చేయగలిగాం. కానీ రాధా కులాన్ని జెండర్ను అడ్డం పెట్టుకొని పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారు. రాధాను శిక్షించిన ఆమే తర్వాత మృతదేహాన్ని అడవిలో వదిపెట్టాల్సి వచ్చింది. భద్రతా బలగాలు తమను చుట్టుముట్టడంతో మృతిదేహాన్ని కుటుంబ సభ్యులుగా అప్పగించలేకపోయాం. రాధా శిక్షపైన మరిన్ని విషయాలు తొందర్లోనే బట్టబయలు చేస్తాం అని మావోయిస్టు పార్టీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version