తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..త్వరలోనే 12750 ఉద్యోగాల భర్తీ

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్‌ రావు. వైద్య ఆరోగ్య శాఖలో 12750 ఉద్యోగాలను నింపపోతున్నామని.. ఇప్పటికే 1326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు మంత్రి హరీష్‌. వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేస్తున్న వైద్యసిబ్బందికి 20 శాతం వెయిటేజీ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

దీనితో దాదాపు అందరూ పర్మనెంట్ ఉద్యోగాలు పొందుతారు. వరంగల్ లో 2000, నిమ్స్ లో అదనంగా మరో 2000, సనత్ నగర్ గడ్డి అన్నారం లో వెయ్యి చొప్పున సూపర్ స్పెషాలిటీ సీట్లను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల రోగాలు 50% మందులతో 50% వైద్య సిబ్బంది ఆత్మీయ స్పర్శతో నయం అవుతాయి. వైద్యులు, వైద్య సిబ్బంది. రోగుల పట్ల ప్రేమ, ఆత్మీయతతో మెలగాలి.

సానిటేషన్ మెరుగుపరిచి, చిరునవ్వుతో, ఆత్మీయతతో పని చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆస్పత్రులను మించిపోతాయి. ప్రభుత్వ వైద్య సేవల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బడ్జెట్లో 11500 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించడంలో వైద్యులకు నా పూర్తి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news